స్థానిక ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఏపీ ప్రభుత్వం సంకల్పానికి తొలి పరీక్ష ఎదురైంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. బీసీలకు గ్రామ పంచాయతీలలో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థలలో 33.3 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది.