హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అమలు చేసిన వన్‌వే విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో దాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లే వాహనదారులకు మెరుగైన కనెక్టివిటీ కల్పించే దిశగా మరో భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఏసీబీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే కాలనీ మీదుగా షేక్‌పేట్ వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర 6 లేన్లతో కారిడార్ నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది.