బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ లేఖలో వరంగల్ సభ నిర్వహణపై అసంతృప్తి, బీజేపీపై మరింత బలంగా మాట్లాడాల్సిన అవసరం, బీజేపీతో భవిష్యత్ పొత్తు ప్రచారాలపై ఆందోళన వంటి అంశాలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చామనే సందేశాన్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని, పార్టీకి స్పష్టమైన వ్యూహాలు, ప్లీనరీ సమావేశాలు అవసరమని కవిత సూచించినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై కవిత ఇంకా స్పందించలేదు.