మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. 25 ఏళ్లుగా తనకు వెన్నదున్నగా ఉంటూ.. పార్టీ కార్యదర్శిగా సేవలు అందించిన ఉద్యమకారుడ్ని ఘనంగా సత్కరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లిపోతున్న ఆయన.. ఒక్కసారి తన స్నేహితుడ్ని కలిసి చెప్పి వెళ్దామని వచ్చారు. ఫామ్‌హౌస్‌కు వచ్చిన అతడ్ని సాదరంగా ఆహ్వానించి ఆయన సేవలకు గుర్తుగా.. ఆత్మీయ వీడ్కోలు పలికారు తెలంగాణ మాజీ సీఎం.