Danam Nagender Latest Interview: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ గొప్ప నాయకుడని.. ఆయన ఓ భోళా శంకరుడంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్, కేటీఆర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. మొన్నటివరకు ఇష్టమున్నట్టు విమర్శలు చేసి.. అసెంబ్లీ సాక్షిగా బూతులతో విరుచుకుపడిన దానం నాగేందర్ ఒక్కసారిగా వారిపై ప్రశంసలు కురిపించటంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి.