Hyderabad independence day Celebrations: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వస్తున్న మొదటి స్వాతంత్ర్య వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికా పర్యటన ముంగించుకుని హైదరాబాద్‌కు తిరిగివచ్చిన సీఎస్ శాంతి కుమారి.. ఏర్పాట్లను పర్యవేక్షించారు. అయితే.. ఈ పంద్రాగస్టు వేడుకల విషయంలో.. మాజీ సీఎం కేసీఆర్ సంప్రదాయాన్నే సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. గోల్కొండ కోటపైనే జాతీయ జెండాను ఎగరేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.