కేసీఆర్ హత్యకు కుట్ర జరిగిందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ వర్గాలు ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు మద్దతుగా ఫామ్‌హౌస్‌కు బయలుదేరిన కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలను మాత్రమే పోలీసులు లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.