కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌పైనా ముఖ్యమంత్రి తీవ్రంగా మండిపడ్డారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే.. 48 గంటల్లో కేసీఆర్, హరీష్ రావులను జైలులో పెడతామని బీజేపీ నేతలు పేర్కొన్నారని.. కానీ అప్పగించిన తర్వాత కేసును, విచారణను తొక్కిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.