సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు నేడు అప్పులపై అప్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళ, విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే ప్రజలకు నరకం చూపిస్తున్నారన్నారు. నగరిలో వైఎస్సార్‌సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. తన గురువు కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన నగరి మరింత నూతన ఉత్తేజం కలిగిస్తుందని.. కూటమి నేతల తప్పుడు ప్రచారం వల్ల వైఎస్సార్‌సీపీ ఓడిపోయిందన్నారు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపారని.. ఆరు నెలలకే నరకం చూపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడుతున్నారని.. వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారని.. వైఎస్ జగన్ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు అందాయన్నారు. ప్రజలు వైఎస్సార్‌సీపీ కావాలని నేడు బలంగా కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అండగా ఉన్నారని.. కూటమి ప్రభుత్వం భయబ్రాంతులకు భయపడొద్దన్నారు. రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. .ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో.. వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామన్నారు.