అటవీ భూమిని డీనోటిఫై చేసి.. వాటిని ప్రయివేట్ వ్యక్తులకు అప్పగిస్తూ ఐదేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీచేశారు. కోట్లాది రూపాయలు విలువైన మొత్తం 72 ఎకరాలను నలుగురు వ్యక్తులకు పట్టాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. దీంతో ఓ వ్యక్తి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి.. దీనిని అడ్డుకోవాలని కోరారు. తాజాగా, ఈ అంశంపై విచారణ చేపట్టిన కోర్టు.. డీనోటిఫై చేసి పట్టాలు మంజూరు చేయడంపై విస్తువోయింది. అటవీ భూమిని డీనోటిఫై చేసే అధికారం కలెక్టర్‌కు ఉందా? అని ప్రశ్నించింది.