కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఒకేసారి 40కిపైగా నిద్రమాత్రలు తీసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆయన గతంలో విద్యుత్ శాఖలో ఏడీఈగా పనిచేసి పదవీ విరమణ చేసినట్లు సమాచారం. మరోవైపు సుమంత్‌పై రియల్ ఎస్టేట్ వ్యాపారి హరికృష్ణ ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ పొందిన సుమంత్ గురువారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.