కొండా సురేఖ వ్యవహారం వేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశాల్లో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం మాటే తన అభిప్రాయమని పేర్కొన్నారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో తన భేటీ నియోజకవర్గ అభివృద్ధి, నిధుల కోసమేనని వివరించారు. ఇక.. తనపై దుష్ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.