హైదరాబాద్‌లో నిర్మించనున్న ట్రంప్ టవర్స్‌లో ఫ్లాట్లు కొనేందుకు చిప్ కంపెనీల ఉద్యోగుల ఆసక్తి చూపిస్తున్నారు. ఏఐ రంగం వృద్ధితో ఉద్యోగులు లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రూ.5.5 కోట్ల నుంచి మొదలయ్యే ఫ్లాట్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ లాంచ్‌కు ముందే భారీగా బుకింగ్స్ రావడం అనేది.. హైదరాబాద్ ప్రీమియం హౌసింగ్ మార్కెట్‌లో మారుతున్న కొనుగోలు ధోరణిని చూపిస్తోంది.