తెలంగాణ రక్షణ సేన నాయకుడి వివాహ వేడుకలో ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక పాత్ర పోషించారు. తనకు అక్కాచెల్లెళ్లు లేరని.. ఇంటి ఆడబిడ్డగా ఉండి వివాహ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆ నేత కోరడంతో ఆయన కోరికను కవిత గౌరవించారు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం గౌరీ పూజలో పాల్గొని, వధువు మెడలో పసుపు కొమ్ముదారంతో మూడు ముళ్లు వేశారు. ఆ తర్వాత ఉంగరం తొడిగి, ఒడిబియ్యం పోసి వధువును ఆశీర్వదించారు. అనంతరం వరుడు మంగళసూత్రధారణ చేయడంతో వివాహ వేడుక పూర్తయింది.