ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ ప్రశంసల జల్లు కురిపించారు. కోటంరెడ్డి చేపట్టిన జెన్‌జీ కార్యక్రమాన్ని అభినందించారు. యువతతో నేరుగా మమేకమై వారి ఆలోచనలు, ఆశలు, సమస్యలు, ప్రభుత్వంపై ఉన్న అంచనాలను తెలుసుకునేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ‘జెన్-జీ యువతతో మాటామంతి’ పేరుతో 51 రోజుల పాటు 51 ప్రాంతాల్లో 20 వేల మంది విద్యార్థులతో సమావేశాలు నిర్వహించనున్నారు.