ఒకప్పుడు సిగరెట్ తాగే అలవాటు ఉన్న తనకు పెళ్లి తర్వాత జీవితంలో మార్పు వచ్చిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య కళ్లలో కనిపించిన బాధ తనను పూర్తిగా మార్చేసిందని తెలిపారు. ప్రార్థనలు, ఓ సాధువు సూచనతో చివరకు సిగరెట్‌తో పాటు హుక్కాను కూడా వదిలేసినట్లు చెప్పారు. డ్రగ్స్ బారిన పడుతున్న యువత, వారి కుటుంబాలు డీ-అడిక్షన్ కేంద్రాలను ఆశ్రయించాలని కోరారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న హత్యలను అరికట్టేందుకు యాంటీ మర్డర్ స్క్వాడ్లు, స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.