మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో తీవ్ర ప్రకంపనలు రేకెత్తిస్తున్నాయి. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమని.. రకుల్ ప్రీత్ సింగ్ త్వరగా పెళ్లి చేసుకునేందుకు కూడా ఆయనే కారణమంటూ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా.. కొండా సురేఖ తనపై చేసిన ఆరోపణలపై రకుల్ ప్రీత్ సింగ్ ఘాటుగా స్పందించారు. ఈమేరకు.. తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ పెట్టారు. తన మౌనాన్ని బలహీనత అనుంకుటారంటూ చురకలంటించింది రకుల్.