మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఆయను ఈరోజు (ఏప్రిల్ 02న) ముంబైలో ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో బైపాస్ సర్జరీ జరిగింది. సుమారు 10 గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్.. విజయవంతమైనట్టు ఆయన కుటుంబ వర్గాలు తెలిపాయి. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరో మూడు రోజుల పాటు కొడాలి నాని వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్టు సమాచారం.