అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులుగా శాసనసభకు హాజరై సమస్యలపై గళమెత్తాల్సిన ఎమ్మెల్యేలు.. అసెంబ్లీకి రాకుండా ప్రజలను అవమానిస్తున్నారని బుద్ధా వెంకన్న ఫైరయ్యారు. అసెంబ్లీకి రాకుండా కూడా జీతం తీసుకుంటున్నారని.. ఇప్పటి వరకూ తీసుకున్న జీతాన్ని వెనక్కి ఇచ్చేసి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. అలాగే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆచూకీ చెప్తే బహుమానం ఇస్తామంటూ ఎద్దేవా చేశారు.