కొడుకు చనిపోయాడనే బాధలో మతి స్థిమితం కోల్పోయి.. 35 ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు చేరిన మహిళ

1 hour ago 2
మానసిక పరిస్థితి సరిగా లేకపోవటంతో ఇంటి నుంచి వచ్చేసిన మహిళ.. 35 ఏళ్ల తర్వాత తిరిగి కుటుంబం చెంతకు చేరారు. బెంగాల్‌కు చెందిన గీతా బిశ్వాస్ అనే మహిళకు మతిస్థిమితం సరిగా లేకపోవటంతో 35 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత ఎక్కడెక్కడో తిరిగి విశాఖకు చేరారు. విశాఖ రైల్వేస్టేషన్‌లో గతేడాది డిసెంబర్ నెలలో ఈమెను గమనించిన అసోసియేషన్ ఫర్ అర్బన్ అండ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ సంస్థ సభ్యులు.. వసతి, వైద్య సహాయం అందించారు. దీంతో ఆమె కోలుకోగా.. 35 ఏళ్ల తర్వాత బెంగాల్‌లోని ఆమె ఇంటికి చేర్చారు.
Read Entire Article