AP CM Chandrababu First sign in 2025: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సరంలో తొలి సంతకం చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నిధుల విడుదలకు సీఎం ఆమోదం తెలిపారు. 1600 మంది పేదలకు రూ.24 కోట్లు విడుదల చేసే ఫైల్ మీద చంద్రబాబు తొలి సంతకం చేశారు. అనంతరం విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు అందరూ బాగుండాలని కోరుకున్నారు. అనంతరం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం.. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.