హైదరాబాద్ నగరవాసులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. మైక్యూర్ పేరుతో ఒక కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఇక నుంచి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా యాప్‌లోనే సేవలు, ఫిర్యాదులు నమోదు చేసే అవకాశం కల్పించింది. నమోదు చేసిన ఫిర్యాదుల స్టేటస్ కూడా యాప్‌లోనే తెలుసుకోవచ్చని వెల్లడించింది. గతంలో ఉన్న యాప్‌ను మరింత సౌకర్యవంతంగా అప్ గ్రేడ్ చేసి ఈ యాప్‌ను జీహెచ్ఎంసీ తెచ్చింది.