తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పండగ లాంటి వార్త చెప్పింది. ఒక్కటి కాదు రెండు కాదు ఒకేసారి మూడు శుభవార్తలు చెప్పింది. కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి సెప్టెంబర్ నుండి సన్న బియ్యం పంపిణీ చేయనుంది. దీంతో పాటుగా మరో వారం, పది రోజుల్లోగా వీరికి ఆరోగ్యశ్రీ పథకం కూడా వర్తింపచేయనుంది. సెప్టెంబర్ నుండి రేషన్ కార్డుదారులకు ఉచితంగా ప్రత్యేక రేషన్ బ్యాగులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.