తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దారులకు రేషన్ బియ్యం ఇంత వరకు అందలేదు. కొత్త కార్డు వచ్చింది కానీ.. రేషన్ మాత్రం తీసుకోని వారు చాలా మంది ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే.. జూన్ నెలలోనే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వారికి ఒకేసారి 3 నెలల రేషన్‌ను పంపిణీ చేసింది. దీంతో పాత వారికి మాత్రమే రేషన్ పంపిణీ చేశారు. కొత్త వారికి సెప్టెంబర్ నెల నుంచి పంపిణీ చేస్తామని అధికారులు చెప్పుకొచ్చారు. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎంత మంది కొత్త రేషన్ కార్డు దారులు ఉన్నారో ఇక్కడ తెలుసుకుందాం.