తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. జూలై 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలగిరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. దీనితో తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 94.72 లక్షలకు చేరుకుంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.