తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. మార్చి 1న మూడు జిల్లాల్లో లక్ష మంది లబ్ధిదారులకు కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించారు. కాగా, కొత్త రేషన్ కార్డులును స్మార్ట్ కార్డు రూపంలో ఇచ్చేందుకు సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ATM తరహా చిప్‌తో ఈ కొత్త కార్డులు ఉండనున్నట్లు సమాచారం.