కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని ప్రకటన విడుదల చేయటమే కాదు.. జనవరి 26వ తేదీన ప్రక్రియ కూడా ప్రారంభించింది. అయితే.. పంపిణీకి ఇప్పటివరకు రెండు మూడు ముహూర్తాలు పెట్టినా.. రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే.. ఈసారి మరో కొత్త ముహూర్తం పెట్టింది ప్రభుత్వం. ఈసారి మాత్రం పక్కా అనే మాట వినిపిస్తోంది.