కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు శుభవార్త. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు మంజూరు ప్రక్రియ వేగవంతమైంది. అర్హులను గుర్తించి లబ్ధిదారులకు అధికారులు కార్డులు ఇస్తున్నారు. అలాగే పాత కార్డుల్లో పేర్లు చేరుస్తున్నారు. ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక యాప్‌తో క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోంది.