తెలంగాణలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కలిపేసి.. కార్పొరేషన్‌గా ప్రమోట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇండస్ట్రియల్ కారిడార్‌గా ఉన్న ఈ ప్రాంతాల్లో అనుకున్నంత అభివృద్ధి జరగకపోవటంతో.. కొత్తగా ఎయిర్ పోర్టు తీసుకురావటంతో పాటు కార్పొరేషన్‌గా మార్చితే.. అనుకున్నంత అభివృద్ధి జరగొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.