కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే వరంగల్ ఎయిర్‌పోర్టుకు నిధులు మంజూరు చేయగా.. రెండో ప్రాధాన్యంగా కొత్తగూడెం ఎయిర్‌పోర్టుపై దృష్టిపెట్టారు. ఈ మేరకు భూసేకరణ, సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు మెుదలుపెట్టారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే ప్రజలకు కనెక్టివిటీ మెరుగు కానుంది.