రాష్ట్రంలోని కొబ్బరి రైతులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. కొబ్బరి చెట్లకు బీమా పథకాన్ని కొత్తగా అమల్లోకి తెచ్చింది. ఏపీలోని 9 జిల్లాలలో ఈ పథకం అమల్లోకి ఉంది. ఈ పథకం కింద రైతులు ప్రీమియం చెల్లిస్తే కొబ్బరి చెట్లకు ఇన్సూరెన్స్ కల్పించనున్నారు. ప్రీమియంలోనూ కొబ్బరి అభివృద్ధి మండలి, ఏపీ ప్రభుత్వం 75 శాతం చెల్లిస్తాయి. మిగతా 25 శాతాన్ని రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కొబ్బరి రైతులను కోరుతున్నారు. మరిన్ని వివరాలకు స్థానిక వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.