కొమురంభీం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొన్ని రోజులు భయాందోళనలకు గురి చేస్తున్న పెద్ద పులి ఏకంగా ఇప్పుడు మనుషులపై పడింది. ఇప్పటి వరకు పశువులపై దాడి చేస్తూ వస్తున్న క్రూర జంతువు.. మహిళపై దాడిచేసి ప్రాణాలు తీసింది. ఈ దాడిలో ఆ మహిళ స్పాట్‌లోనే చనిపోయింది. కాగజ్ నగర్ మండలంలో ఓ గ్రామానికి చెందిన మహిళ పత్తి చేనులో పని చేస్తుండగా.. పంజా విసిరింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి దాడికి ఇంకా ఎంత మంది ప్రాణాలు పోవాలి అంటూ అధికారులను నిలదీస్తున్నారు