కొమురవెల్లి మల్లన్న స్వామి భక్తుల కోసం మనోహరాబాద్–సిద్దిపేట్ మార్గంలో కొత్త డెమూ రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న నాలుగు రైళ్ల వేళలు ఆలయ దర్శనానికి అనుకూలంగా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త రైలు కోసం తొలుత ట్రాఫిక్ సర్వే, ఆదాయ–వ్యయ నివేదిక, టైమ్‌టేబుల్ రూపకల్పన చేస్తారు. లైన్ కెపాసిటీని పరిశీలించి ప్రతిపాదనను రైల్వే బోర్డుకు పంపనున్నారు. అనుమతులు, తదితర ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది.