జనసేన నాయకురాలు కోట రుక్మిణి, వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మధ్య ఉద్యోగాల మోసం ఆరోపణలతో మొదలైన వివాదం మరింత ముదిరింది. నాగార్జున యాదవ్, సాక్షి మీడియా సంస్థ, కొందరు సోషల్ మీడియా కార్యకర్తలపై న్యాయవాదులు, జనసేన వీర మహిళలు ఏపీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు కోట రుక్మిణి పంపిన లీగల్ నోటీసులకు నాగార్జున యాదవ్ స్పందిస్తూ సీబీఐ, ఈడీ విచారణ కోరాలని సవాల్ చేశారు.