ఇటీవల కొత్త రాజకీయ వేదికను ప్రారంభించిన రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి.. తన పార్టీ పీఆర్పీ తరఫున బుధవారం కార్యాచరణను ప్రకటించారు. తమ పార్టీలో పూర్తి సామాజిక న్యాయం ఉంటుందని, అట్టడుగు వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నట్టు తెలిపారు. వచ్చే ఉగాది తర్వాత తన యాత్ర మొదలుపెడతానని ఆయన పేర్కొన్నారు.