తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రారంభ వేడుకలు, గచ్చిబౌలిలో ముగింపు కార్యక్రమం జరగనుంది. ఈ పోటీల్లో తెలంగాణ సంప్రదాయ యుద్ధకళ కర్రసామును ప్రదర్శన క్రీడగా ప్రవేశపెట్టనున్నారు. ఏర్పాట్లలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మొత్తం 27 క్రీడాంశాల్లో 1,334 మంది రాష్ట్ర క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నారు.