తెలంగాణ వీర మహిళ చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయాయారు. ఈ కార్యక్రమానికి చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించటంతో పాటు వారిని సన్మానించారు. అంతేకాకుండా.. చాకలి ఐలమ్మ మనవరాలిని మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.