కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. ఆరుగురు స్పాట్ డెడ్

1 hour ago 1
హైదరాబాద్–విజయవాడ హైవేపై కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఐరన్ రాడ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Entire Article