Tirumala Every Tuesday Cleaning Day: తిరుమలలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి మంగళవారం క్లీనింగ్ డేగా ప్రకటించింది.. తిరుమలలో ప్రతి మంగళవారం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను ఉదయం నుంచి సాయంత్రం వరకు మూసివేసి శుభ్రం చేయనున్నారు. టీటీడీ ఆదేశాలతో ఈ సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో పరిశుభ్రత ఉండటం లేదని ఫిర్యాదులు రావడంతో టీటీడీ ఈ క్లీనింగ్ డేను పాటిస్తున్నారు.