కోమటిరెడ్డి వెంకన్న మంచి మనసు.. పేద విద్యార్థినికి అండగా మంత్రి..

3 months ago 18
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచి మనసు చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో స్కూలు ఫీజు కట్టలేకపోతున్న ఓ పేద విద్యార్థినికి అండగా నిలబడ్డారు. పదో తరగతిలో 582 మార్కులు సాధించిన భవిత అనే విద్యార్థిని.. స్కూలు ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్న సంగతిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. వెంటనే స్పందించారు. స్కూలు ప్రిన్సిపల్‌తో మాట్లాడి, స్కూలు ఫీజు చెల్లించి విద్యార్థినికి సర్టిఫికేట్లు అందేలా చూశారు.
Read Entire Article