హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని కో లివింగ్ హాస్టల్స్ ఇప్పుడు మత్తు పదార్థాల విక్రయాలకు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. రాయదుర్గం అంజయ్య నగర్‌లోని ఒక ప్రముఖ హాస్టల్లో పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అధిక జీతాలు తీసుకునే సాఫ్ట్ వేర్ ఉద్యోగులే లక్ష్యంగా ఈ దందా సాగుతోంది. ఆర్థిక స్తోమత ఎక్కువగా ఉండటంతో మత్తు కోసం వారు ఎంతైనా ఖర్చు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరు విక్రయదారులతో పాటు డ్రగ్స్ వాడుతున్న ముగ్గురు ఐటీ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా నిఘా పెంచి.. హాస్టల్ యజమానులకు కఠిన హెచ్చరికలు జారీ చేస్తోంది.