మహిళా డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది రక్షణ కోసం తెలంగాణలోని గవర్నమెంట్ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ఆసుపత్రుల్లో రాత్రి సమయాల్లో షీ టీమ్‌లతో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అలాగే పోలీసు అవుట్ పోస్టులను కూడా ఏర్పాటు చేయాలన్నారు.