తెలంగాణ గ్రామాల్లో సర్పంచ్ పదవుల వేలం కలకలం రేపుతోంది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా లక్షలు, కోట్లు వెచ్చించి సర్పంచ్ పదవులు ఏకగ్రీవం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ గ్రామ సర్పంచ్ పదవి కోసం రూ. కోటి వెచ్చించటం చర్చనీయాంశమైంది. ఈ పద్ధతి ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువలను అపహాస్యం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.