తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న క్యూర్-2026 చట్టం ద్వారా పాత జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను భారం భారీగా పెరగనుంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న వార్షిక అద్దె విలువ విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో భూమి ప్రభుత్వ మార్కెట్ ధర ఆధారిత క్యాపిటల్ వ్యాల్యూ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని ఈ చట్టం ప్రతిపాదిస్తోంది. దీనివల్ల జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని 25 లక్షల నిర్మాణాల పన్నులు కొన్నిచోట్ల 3 నుంచి 4 రెట్లు పెరిగి ప్రభుత్వానికి రూ.700 కోట్ల వరకు అదనపు ఆదాయం రానుంది.