క్యూర్ పరిధిలోని 26 ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న 21 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 30లోపు లక్కీడ్రా ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లకు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సదుపాయాలను అక్టోబరు నెలాఖరులోగా కల్పించాలని సూచించారు. అనర్హుల కేటాయింపులు రద్దు చేసి అర్హులకు ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు క్యూర్ పరిధిలో ఇంటి స్థలాలున్న దాదాపు 9 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి.