ఏపీలోని క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. అన్నీ అనుకున్నట్లు కుదిరితే త్వరలోనే ఏపీలోని మరో రెండుచోట్ల కూడా మనం క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించవచ్చు. ఏపీలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లను విశాఖలో మాత్రమే నిర్వహిస్తున్నారు. అయితే మంగళగిరిలోని ఇంటర్నేషనల్ స్టేడియం, కడపలోనూ అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించేలా చూస్తామని ఏసీఏ నూతన అద్యక్షుడు కేశినేని చిన్ని వెల్లడించారు. అలాగే వరద బాధితుల కోసం ఏసీఏ తరుఫన కోటి రూపాయలు విరాళం కూడా ప్రకటించారు.