కండ్లకోయలో అయ్యప్ప స్వామి భక్తులు పడి పూజ చేసుకుంటున్న చోటుకు వెళ్లిన మేడ్చల్ ఎస్సై.. క్రిస్మస్ రోజున పూజలు, భజనలు చేయొద్దంటూ భక్తులతో వాగ్వాదానికి దిగారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఎక్స్‌లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఇందులో నిజానిజాలను తేల్చడం కోసం సజగ్ టీమ్ రంగంలోకి దిగింది. మేడ్చల్ పోలీసులను సంప్రదించగా.. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని సౌండ్ తగ్గించాలని మాత్రమే తాము సూచించామన్నారు.