తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు పండుగలాంటి వార్తను అందించింది. ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.6 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. రజత పతకానికి రూ.4 కోట్లు, కాంస్య పతకానికి రూ.2.5 కోట్లు ఇవ్వనున్నారు. క్రీడాభివృద్ధి కోసం నూతన క్రీడా విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్-స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. సీఎం కప్‌లో సత్తా చాటిన వారికి స్పోర్ట్స్ కోటా ద్వారా రిజర్వేషన్లు కల్పించనున్నారు.