ఖమ్మం కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్.. తన గొప్ప మనుసు చాటుకుంటున్నారు. అటు పాలనలోనే కాదు.. సమస్యల పరిష్కారంలోనూ తనదైన శైలి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే.. గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంతో పాటు నిత్యం ఏదో పని మీద కలెక్టరేట్‌కు వచ్చే దివ్యాంగులను ఖాళీ కడుపుతో పంపించొద్దన్న భావనతో.. ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నారు. మార్చి 05వ తేదీ నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.