ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న సోనోవిజన్ షోరూంలో దొంగలు పడ్డారు. కేవలం 15 నిమిషాల్లోనే రూ. 67 లక్షల విలువైన 160 స్మార్ట్ ఫోన్లను సంచుల్లో నింపుకుని పారిపోయారు. అయితే ఏపీలోని విజయవాడ హెడ్ ఆఫీస్ సిబ్బంది లైవ్ కెమెరాల్లో ఈ దొంగతనాన్ని చూసి స్థానిక సిబ్బందిని అలర్ట్ చేశారు. దీంతో ఇద్దరు సిబ్బంది హుటాహుటిని అక్కడకు చేరుకున్నారు. కానీ అప్పటికే నిందితులు కారులోకి ఎక్కి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. అయినా ప్రాణాలకు తెగించి బైక్‌ను అడ్డు పెట్టారా సిబ్బంది. కానీ ఏమాత్రం వెనక్కి తగ్గని నిందితులు కారును ముందుకు పోనిచ్చి మరీ పారిపోయారు.